Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నైనా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ కొడంగల్ లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం అరటి తొక్కలు తింటూ వినూత్న నిరసన – ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని లేకుంటే ఆయనను ఆయన ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా కొడంగల్లో లక్ష మందితో వికలాంగుల ఆవేదన సభ నిర్వహిస్తామని గిద్దె రాజేష్ హెచ్చరిక

కొడంగల్, ఆగస్టు 14: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అయినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అరటి తొక్కలు తింటూ భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలులో జాప్యం చేస్తుండటం బాధాకరమని. ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంచుతామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని , రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ చేస్తామని, వికలాంగుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అన్ని చట్టాల అమలు తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని. ముఖ్యంగా రేపు జరిగే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తన ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇకపై హామీల పేరుతో కాలయాపన చేస్తే వికలాంగుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని గిద్దె రాజేష్ హెచ్చరించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి వికలాంగుల సమస్యలను పరిష్కరించకపోతే కొడంగల్‌లో లక్ష మందితో భారీగా “వికలాంగుల ఆవేదన సభ” నిర్వహించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే తమ లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు, జిల్లా ఇంచార్జ్ పోతురాజు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం చుక్కయ్య సంఘం మహిళా నాయకురాలు అలివేలు సంఘం రాష్ట్ర నాయకులు గణేష్ చంద్రయ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏం చుక్కయ్య సంఘం జిల్లా నాయకులు వినోద్ కుమార్ బందయ్య నాయకులు, కార్యకర్తలు పరుగులు సంఘం నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *