Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

పవర్ ఎగ్జిబిషన్–2026 విజయవంతానికి కృషి చేసిన టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు

హైదరాబాద్, ఆగస్టు 24, 2026

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఆగస్టు 22, 23, 24 తేదీలలో టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ ఎగ్జిబిషన్–2026 ఘన విజయవంతమైంది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనకు విద్యార్థులు, యువత, విద్యుత్ రంగ నిపుణులు, ప్రజలు విశేషంగా హాజరై విద్యుత్ రంగ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలపై అవగాహన పొందారు.

ఈ ఎగ్జిబిషన్ విజయవంతం కావడంలో టీజీఎస్పీడీసీఎల్‌కు చెందిన అధికారులు, ఇంజినీర్లు, ఉద్యోగులు, సిబ్బంది అహర్నిశలు శ్రమించారు. ప్రదర్శన ఏర్పాట్లు, సందర్శకుల మార్గదర్శనం, సాంకేతిక స్టాల్స్ నిర్వహణ, భద్రతా చర్యలు, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయం తదితర అంశాల్లో ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేశారు.

మూడు రోజుల కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వహణలో భాగస్వాములైన టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, ఉద్యోగులు స్మారకంగా గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అధికారులు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *