హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నూతనంగా ఏర్పాటు చేసిన అనిరుద్ హోమియోపతి హాస్పిటల్‌ను నేడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన హోమియోపతి వైద్య సేవలు అందిస్తూ, మరింత మంది ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.
నూతనంగా ప్రారంభమైన అనిరుద్ హోమియోపతి హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి నిర్వాహకులు విజయవంతంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు అభిలషించారు.
