హైదరాబాద్, సెప్టెంబర్ 03, 2026 : సెప్టెంబర్ 10, 2026న నిర్వహించనున్న ” చలో హైదరాబాద్” (ఎల్. బి. స్టేడియం) లో కార్యక్రమం విజయవంతం చేయుటకు:
సన్నాహక సమావేశం, పోస్టర్ ఆవిష్కరణ తదితర విషయాల పై చర్చించుటకు సెక్రటరీ జనరల్, TGEJAC ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ
సచివాలయం, మేడ్చల్, భువనగిరి యూనిట్ల చైర్మన్లు, కన్వీనర్లు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం టీఎన్జీఓస్ భవన్, నాంపల్లి, హైదరాబాద్ లో జరిగింది. TG ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.
