ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వర్యులు వివేక్ గారు,బీసీ శాఖ ముఖ్య సలహాదారులు వి హనుమంత్ రావు గారు.
వాషర్ మెన్ కార్పొరేషన్ చైర్మెన్ D. అజయ్ కుమార్ వైస్ చైర్మన్ బంగారు బాబు.
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతాంగ సాయుధ పోరాట యోధురాలు తెలంగాణ వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రభుత్వం రవీంద్ర భారతీ అధికారికంగా ఘనంగా నిర్వహించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.బిసి శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కొన్ని అనివార్య కారణాల వలన రాలేకపోయినా చారవాణి ద్వారా వారి సందేశాన్ని వినిపించారు.
ఇట్టి కార్యక్రమంలో బీసీ శాఖ ముఖ్య సలహాదారులు వి హనుమంత్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ గారు, బిసి కమిషన్ చైర్మెన్ నిరంజన్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయి కుమార్ గారు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ క్రిష్ణయ్య మరియు వివిధ కార్పొరేషన్ చైర్మెన్ లు, వైస్ చైర్మన్ లు, మహిళా మణులు మరియు వివిధ జిల్లాలు నుండి వచ్చిన రజక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
