Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
Uncategorized

బంజారా ఫంక్షన్ హాల్ లో 2000 మంది అభిమానులతో పల్లపు గోవర్ధన్ గారి ఆత్మీయ సమ్మేళనం

యువత అభివృద్ధి కోసం రాజకీయాలకు వస్తున్న

ఎవరిని విమర్శించం బస్తీలు అభివృద్ధి కోసమే ఉద్యమిస్తా : పల్లపు గోవర్ధన్

హైదరాబాద్, 4 సెప్టెంబర్, 2026, బంజారాహిల్స్ : యువత అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎవర్ని విమర్శించమని కేవలం బస్తీల అభివృద్ధి కోసమే ఉద్యమిస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి, నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకుడు పల్లపు గోవర్ధన్ పేర్కొన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లోని బంజారా ఫంక్షన్ హాల్ లో ఖైరతాబాద్ యువత తో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ప్రజా సమస్యల కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని, టైగర్ నరేంద్ర, బద్దం బాల్రెడ్డి పీజేఆర్ వంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని వారి వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నానని పునరుద్ఘాటించారు. ఖైరతాబాద్ ఎవరి అబ్బసత్తు కాదని నియోజకవర్గం అంతా పేదలు శ్రమజీవులతో నిర్మితమైందని తెలిపారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న బస్తీల అభివృద్ధి పనులను, పేదల ప్రజలను విస్మరించారని ఆరోపించారు. తాను పదవి ఉన్నా లేకపోయినా పేదల కోసం కృషి చేస్తూ ఆసుపత్రులు దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాను అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమావేశానికి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల కుల సంఘాల పెద్దలు యువత, మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *