32 కేజీల గంజాయి స్వాధీనం.
ఒరిస్సా నుంచి బయటకు దూల్పేట్ కు దిగుమతి.
ఒరిస్సా నుంచి హైదరాబాదులో దూల్‌పేటకు 32 కేజీల గంజాయిని తరలిస్తూ ఉండగా దూల్పేట్ ఎక్సైజ్ సీఐ ప్రవీణ్ కుమార్ మరో సిఐ విప్లవ రెడ్డి సిబ్బంది కలిసి పట్టుకున్నారు.
మంగురు బస్తీకి 32 కేజీల గంజాయిని స్కూటీపై తీసుకు వస్తున్న సాకేత్ బాబును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో సాకేత్ బాబుని అరెస్టు చేసి, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుకున్న గంజాయి విలువ రూ. 16 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు.
ఈ కేసులో సాకేత్ బాబుతో పాటు అవ్జిత్ కుంబ్లీ రాహుల్ కుంబ్లీ హాట్ గర్ల్ దేవిదాస్ హాట్ గాడ్ సంజయ్ లపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఈ గంజాయిని పట్టుకున్న కేసులో జనార్దన్, రిశ్వాన్, ప్రసాద్, రవి, నాగరాజు,సూర్య, షాజహాన్,హేమ, మహేశ్వరి, అనితలు ఉన్నారు.
నిందితుడిని గంజాయిని కోర్టులో హాజరు పరిచినట్లు సిఐ పేర్కొన్నారు.
