పరమ పూజనీయ గురుదేవులు, శ్రీ స్వామి గోవిందదేవ్ గిరి మహారాజ్ గారి దివ్య సాన్నిధ్యంలో, నవవిభక్తుల విశిష్టతను వివరిస్తూ రెండు రోజుల పాటు జరగనున్న ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం భక్తులందరికీ ఒక విశేషమైన అవకాశం.
గురుదేవుల అమృతవాక్కులు మనలో భక్తిభావాన్ని పెంపొందించి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వికసింపజేసి, భగవంతుని తత్త్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు మార్గదర్శనం చేసాయి.
ఈ కార్యక్రమం అక్టోబర్ 24 & 25, 2026 సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు భారతీయ విద్యా భవన్ ఆడిటోరియం, కింగ్ కోఠి, హైదరాబాద్ లో జరిగింది
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జించడానికి, గురుదేవుల దివ్య ప్రవచనాలను ఆలకించడానికి లభించే ఇటువంటి పవిత్ర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మనందరి అదృష్టం అని నిర్వాహకులు అన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేసి, గురుదేవుల ప్రవచనామృతాన్ని ఆస్వాదించి, వారి దివ్య ఆశీస్సులను పొందడం సంతోషకరం.
గురువాక్కులను శ్రవణం చేద్దాం! వేదాంత జ్ఞానాన్ని తెలుసుకుందాం!
భక్తి మార్గంలో మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం! గురుదేవుల దివ్య ఆశీస్సులు సర్వేజనులపై సదా ఉంటాయని తెలిపారు. : జై శ్రీకృష్ణ
