Mon, 26 Oct 2026
🔴 BREAKING
అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి – మాగంటి సునీత గోపీనాథ్ మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌కు చుక్క నీరు రాలేదు జై శ్రీకృష్ణ! జై గురుదేవ్! ఓం శ్రీ పరమాత్మనే నమః అపూర్వ ఆధ్యాత్మిక అవకాశం – దివ్య ప్రవచనామృతం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Uncategorized

మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌కు చుక్క నీరు రాలేదు

జనవరి 2027 నాటికి నగరానికి మరో 5 టీఎంసీల నీరు

ఖైరతాబాద్, అక్టోబర్ 25 : హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని దానం నాగేందర్ అన్నారు. 2027 జనవరి నాటికి హైదరాబాద్‌కు మరో 5 టీఎంసీల నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ మేరకు ఆదర్శ్ నగర్ లొని ఎం ఎల్ ఎ క్వార్టర్స్ లొ ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు అంశంపై పోరాటం జరుగుతోందని, రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. దేశంలోని మారుమూల గ్రామాల నుంచి సైతం ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారని పేర్కొన్నారు.బీఆర్‌ఎస్ నాయకులు మేడిగడ్డ పర్యటనను రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారనివిమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలుచోటుచేసుకుంటున్న నేపథ్యంలో, ఈ అంశాన్ని కూడా బీఆర్‌ఎస్ రాజకీయాలకు ఉపయోగించుకుంటోందనిఆరోపించారు.హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే చర్యలు చేపట్టాయని దానం నాగేందర్ తెలిపారు. గోదావరి నదిలోని ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు 10 టీఎంసీల నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు.మేడిగడ్డ బ్యారేజీ గేట్లను మూసివేస్తే ప్రమాదం పొంచి ఉంటుందని జాతీయ డ్యామ్‌ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) హెచ్చరించిందని తెలిపారు. మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌కు ఇప్పటివరకు ఒక్క టీఎంసీ నీరు కూడా రాలేదని విమర్శించారు.
నగర భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *