హైదరాబాద్, జులై 25, 2026:
హైదరాబాద్ రాజ్ భవన్‌లోని సంస్కృతి హాల్లో ‘హైదరాబాద్ స్టార్టప్ ఇకోసిస్టమ్ అవార్డ్స్ (HSEA) 2026’ వేడుక వైభవంగా జరిగింది.
తెలంగాణ గౌరవ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ముద్రిక సెక్యూర్ ప్రింట్ & ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్’ మరియు ‘AXIARA’ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో దాదాపు 150 మంది స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపార ప్రముఖులు పాల్గొని నగర ఆవిష్కరణల ప్రతిభను చాటిచెప్పారు.
కార్యక్రమంలో భాగంగా, ముద్రిక సెక్యూర్ ప్రింట్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఉదయ్ మూర్తి భోగాది రచించిన “The CEO She Never Knew She Was” పుస్తకాన్ని గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఒక తల్లి తన సహనం ద్వారా, దూరదృష్టి ద్వారా, నడవడిక ద్వారా కుటుంబాన్ని, సమాజాన్ని మరియు కాబోయే నాయకులను ఎలా తీర్చిదిద్దుతుందో ఈ పుస్తకం ద్వారా రచయిత వివరించారు.
అనంతరం, హైదరాబాద్‌ను దేశంలోనే ప్రముఖ స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన పలువురు ప్రతిభావంతులకు గవర్నర్ HSEA 2026 అవార్డులను అందజేశారు. డీప్ టెక్, హెల్త్‌కేర్, అగ్రిటెక్, పర్యావరణ పరిరక్షణ, మీడియా, విద్య, సామాజిక సేవా రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలు లభించాయి.
*అవార్డు గ్రహీతలు* :
గౌరవనీయులు శ్రీమతి స్వర్ణలత బుర్రవల్లి ది ఫ్రంటియర్ అవార్డ్ (స్కైరూట్ ఏరోస్పేస్)
డాక్టర్ శ్రీదేవి S. మరియు శ్రీ చంద్రశేఖర్ M.V. – ది వైటల్ అవార్డ్ (ఆంథియా ఫార్మా)
శ్రీ ప్రభ్ దీప్ సింగ్ – ది పల్స్ అవార్డ్ (RED.Health)
శ్రీ ప్రియేష్ మెహ్రెత్రా – ది ధర్మ అవార్డ్ (రీసైకల్)
శ్రీ ప్రేమ్ కుమార్ V.- ది ఆల్టిట్యూడ్ అవార్డ్ (మరుత్ డ్రోన్స్)
శ్రీమతి దివ్య కొత్తమాసు- ది శక్తి అవార్డ్ (N స్పేస్ టెక్)
శ్రీ వెంకట్ ఆదిత్య గుంటూరు ది క్రానికల్ అవార్డ్ (వే2న్యూస్)
శ్రీ వరుణ్ – ది ఇగ్నైట్ అవార్డ్ (స్టూడెంట్ ట్రైబ్)
శ్రీ D. నందకిషోర్ రెడ్డి – ది శాంక్చురీ అవార్డ్ (రాగా ఫౌండేషన్)
శ్రీ పంకజ్ దివాన్ – ది కల్టివేటర్ అవార్డ్ (TalentFarm.ai)
శ్రీ శ్రీనివాస్ తాలుకా – ది బెడ్రక్ అవార్డ్ (T-Hub)
శ్రీ కృష్ణ, శ్రీమతి సుజాత మరియు శ్రీ పంకజ్ దివాన్ ది ఫెడరేషన్ ఆనర్
శ్రీ అభిషేక్ గంగూలీ- ది కాంపాస్ అవార్డ్ (TiE హైదరాబాద్)
ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ్ మూర్తి భోగాది ప్రతినిధి మాట్లాడుతూ, హైదరాబాద్ స్టార్టప్ వ్యవస్థ నగర ఆర్ధిక పురోగతికి అందిస్తున్న సేవలను గుర్తించి, వారిని 2 HSEA 2026 . “The CEO She Never Knew She Was” పుస్తకావిష్కరణ సందర్భంగా సమాజంలోనూ వ్యాపార రంగంలోనూ మార్పు కోసం నిశ్శబ్దంగా కృషి చేస్తున్న నాయకులను సత్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. నాయకత్వ పటిమను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ.. వివిధ రకాల వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు మరియు పరిశ్రమల మధ్య బలమైన సహకారాన్ని పెంపొందించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యం.
