Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

వివాహమైన మరుసటి రోజే వికలాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతి అందించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు అన్నింటిని వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న వికలాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతులను తక్షణమే విడుదల చేసి, వికలాంగులకు వివాహమైన మరుసటి రోజే ప్రోత్సాహక బహుమతి అందించే విధానాన్ని అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు గ్రామంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. జహీర్ బాబా వివాహ రిసెప్షన్‌ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంఘం ఆత్మకూర్ ఎస్ మండలం ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనవరి 17, 2026న ప్రకటించిన వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి రెండు లక్షలను వెంటనే అమలు చేయడంతో పాటు, దానిని రూ.10 లక్షలకు పెంచాలని. ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం ఇచ్చి, ఉచిత ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడంతోపాటు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన ఇచ్చిన హామీల మేరకు వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం–2016ను సమర్థంగా అమలు చేయాలని,వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో చట్టం చేయాలని, ఆ రిజర్వేషన్ అమలు చేసిన తరువాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీల అమలుకోసం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా సీనియర్ నాయకులు పేర్ల సోమయ్య యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు గుండు శ్రీనివాస్ జిల్లా జిల్లా నాయకులు గార్లపాటి వెంకటరెడ్డి మండల నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *