హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశాల మేరకు, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సును వెంగల్ రావు నగర్ డివిజన్లోని శ్రీ సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి గారు, మైనారిటీ సీనియర్ నాయకులు మోయిద్ ఖాన్ హాజరై పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పట్టభద్రుల ఓటు కేవలం ఓటు హక్కు మాత్రమే కాదు, విద్యావంతుల గొంతుకకు ప్రతీక అని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రులు చురుకుగా భాగస్వాములు కావాలని, ఒక్క అర్హుడైన ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారికి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, ప్రతి బూత్ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రతి అర్హుడైన గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులందరూ సమష్టిగా కృషి చేయాలి. పట్టభద్రుల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కమిటీ సభ్యులు, బూత్ ఇన్చార్జులు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి: అర్హులైన పట్టభద్రులందరూ నిర్ణీత చివరి తేదీలోగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకొని తమ ప్రజాస్వామ్య హక్కును సద్వినియోగం చేసుకోవాలి.
