ఎక్సైజ్ ఎస్టీఎఫ్ (STF) 4.45 గ్రాముల MDMA, వోక్స్‌వ్యాగన్ పోలో కారు, మినీ వెయింగ్ మిషన్, 2 ఖరీదైన మొబైల్స్ స్వాధీనం. ఒకరి అరెస్ట్
వృత్తి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రఫీ. తీరిక సమయాల్లో అధిక సంపాదన కోసం డ్రగ్స్ అమ్మకానికి పాల్పడుతున్న టీం ను ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ బీ టీం సిఐ రమేష్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు.
ఈ కేసులో ముగ్గురు నిందితుల్లో ఒకరి అరెస్టు కాగా మరో ఇద్దరు పరారిలో ఉన్నారు.
అందరూ నిందితులు రాజమండ్రి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
అందరూ మణికొండలో నివాసం ఉంటారు.
ఖాజాగూడ – నానక్‌రామ్‌గూడ సర్వీస్ రోడ్డు వద్ద కారులో MDMA డ్రగ్స్ ఉంచుకుని వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఒక నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, అతని వద్ద నుండి 4.45 గ్రాముల MDMA
నేరానికి ఉపయోగించిన వోక్స్‌వ్యాగన్ పోలో కారు, చిన్న డిజిటల్ తూకం యంత్రం మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల పర్యవేక్షణ & దాడి
శ్రీ ఎస్. రమేష్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ (CI), STF టీమ్ సంతోష్, ప్రసాద్, ప్రభు, సతీష్, రాహుల్ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఖాజాగూడ – నానక్‌రామ్‌గూడ సర్వీస్ రోడ్డు వద్ద నిఘా ఉంచి ఎరుపు రంగు వోక్స్‌వ్యాగన్ పోలో కారు వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని ఆకుల సాయి రామ్ చుట్టు ముట్టి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వివరాలు:
A1 , ఆకుల సాయి రామ్ ను అరెస్టు చేశారు.
నిందితుడు ప్రస్తుత నివాసం: మణికొండ, హైదరాబాద్ ఉంటున్నాడు.
ఈ కేసులో A2 రామిరెడ్డి మహేష్ రెడ్డి,.A3 తాండ్ర హరిశ్చంద్ర పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
MDMA (మత్తు పదార్థం): 4.45 గ్రాములు
రవాణాకు ఉపయోగించిన కారు: వోక్స్‌వ్యాగన్ పోలో,
డిజిటల్ వెయింగ్ మెషిన్: డ్రగ్స్ తూకం వేసి అమ్మే చిన్న ఎలక్ట్రానిక్ త్రాసు (1)
మొబైల్ ఫోన్లు (2)ను స్వాధీనం చేసుకున్నారు.
A1 (ఆకుల సాయి రామ్) సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో A2 మరియు A3 ల వద్ద నుండి రూ. 25,000/- నగదు చెల్లించి MDMA కొనుగోలు చేశాడు.
నగరంలోని యువతకు, కస్టమర్లకు చిన్న డిజిటల్ త్రాసుతో తూకం వేసి గ్రాములకు రూ. 10 వేల లెక్కన ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నాడు.
పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, కారు మరియు ఇతర సామగ్రిని తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం కొండాపూర్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO) కు అప్పగించారు.
పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ శ్రీ అవినాష్ మోహంతి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్టిఎఫ్ బీటింగ్ ఈ డ్రగ్స్ ను పట్టుకున్నారు. రక్షణ పట్టుకున్న టీమను ఆయన అభినందించారు.
