గణేష్ చతుర్థి నవరాత్రుల సందర్భంగా ఆరవ రోజు రాత్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు గాంధీ నగర్,లలితా నగర్ కాలనీ,సుమన్ కాలనీ,వెస్ట్ మారేడ్పల్లి,మట్ఫోర్డ్ హట్స్
ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులతో ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు ఆత్మీయంగా ముచ్చటించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు ఆకాంక్షించారు.

