కొత్త నియోపోలిస్ కార్యాలయం నగరం పట్ల, భారతదేశం పట్ల సంస్థ దీర్ఘకాలిక నిబద్ధతను మరింత బలపరుస్తుంది.
హైదరాబాద్, అక్టోబర్ 7, 2026: D. E. Shaw గ్రూప్‌లో భాగమైన D.E. Shaw India Private Limited, భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు వార్షికోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నియోపోలిస్‌లో ఉన్న గ్రావా బిజినెస్ పార్క్ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి శ్రీ డి. శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రితో పాటు D. E. Shaw గ్రూప్ నాయకులు హాజరయ్యారు.
D. E. Shaw India 1996లో హైదరాబాద్‌లో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. అనంతరం 2023లో బెంగళూరు, గురుగ్రామ్‌లలో కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాల్లోని బృందాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సహచరులతో కలిసి పనిచేస్తూ, D. E. Shaw గ్రూప్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పరిశోధన, కార్యకలాపాల సామర్థ్యాలను అందిస్తున్నాయి.
30 ఏళ్లలో పెట్టుబడులు, సాంకేతికత రంగాలు గణనీయంగా మారాయి. ఈ మార్పులకు అనుగుణంగా సంస్థను ముందంజలో కొనసాగించడంలో D. E. Shaw Indiaలోని మా సహచరులు ప్రదర్శిస్తున్న క్రమశిక్షణ, నైపుణ్యం కీలక పాత్ర పోషించాయి. హై-పర్ఫార్మెన్స్ కలిగిన డేటా, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడంతో పాటు, వినూత్న ALI సాధనాలు, ప్రపంచవ్యాప్తంగా కొత్త సమస్యలను పరిష్కరించేందుకు మరియు మా పని విధానాలను నిరంతరం మెరుగుపరచేందుకు ఉపయోగపడే అనేక ఇతర వ్యవస్థలను కూడా మేము అభివృద్ధి చేశాం,” అని శ్రీ ఎడి ఫిష్ మన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, D. E. Shaw గ్రూప్, అన్నారు.
“హైదరాబాద్‌లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న D. E. Shaw Indiaకు నా అభినందనలు. మూడు దశాబ్దాలుగా ఈ సంస్థ హైదరాబాద్ నగరంతో కలిసి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. కొత్త కార్యాలయం హైదరాబాద్ల్పో సంస్థకు ఉన్న నిరంతర నమ్మకానికి, ఇక్కడ తన కార్యకలాపాలను మరింత విస్తరించాలనే నిబద్ధతకు నిదర్శనం,” అని శ్రీ డి. శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, అన్నారు.
2027లో ప్రారంభం కానున్న ఈ అత్యాధునిక కార్యాలయం 6 లక్షల స్క్వేర్ ఫీట్ కు పైగా విస్తీర్ణంలో ఉండనుంది. D. E. Shaw Indiaలోని డైనమిక్ వర్క్ కల్చర్‌కు మరింత బలం చేకూర్చడంతో పాటు, వివిధ బృందాలు కలిసి పనిచేయడానికి, ఆలోచనలను పరస్పరం పంచుకోవడానికి, సమస్యలకు సమిష్టిగా పరిష్కారాలు కనుగొనేందుకు ఉద్యోగులకు మరిన్ని అవకాశాలను ఈ కొత్త కార్యాలయం అందించనుంది.
“D. E. Shaw India ప్రయాణం మొదలైంది హైదరాబాద్‌లోనే. 30 ఏళ్ల తర్వాత కూడా ఈ నగరమే మా కథకు కేంద్ర బిందువు,” అని మేనేజింగ్ డైరెక్టర్ మరియు D. E. Shaw India ఆపరేటింగ్ కమిటీ సభ్యుడు శ్రీ చైతన్య గొర్రెపాటి అన్నారు. “గ్రావా బిజినెస్ పార్క్ మా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నాం. భారతదేశంలో మా వృద్ధిలో ఇది తదుపరి అధ్యాయానికి నాంది…”
D. E. Shaw గ్రూప్ ఒక ప్రపంచస్థాయి పెట్టుబడి, సాంకేతిక అభివృద్ధి సంస్థ. సెప్టెంబర్ 1, 2026 నాటికి ఈ సంస్థకు 115 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి, కమిటెడ్ క్యాపిటల్ ఉంది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాల్లో దీనికి కార్యాలయాలు ఉన్నాయి. 1988లో స్థాపించినప్పటి నుంచి, విజయవంతమైన పెట్టుబడుల ద్వారా సంస్థ ఖ్యాతి గడించింది. ఆవిష్కరణ, జాగ్రత్తతో కూడిన రిస్క్ మేనేజ్ మెంట్, సిబ్బంది నాణ్యత, నైపుణ్యాల లోతు ఆ విజయానికి పునాది. ప్రపంచ క్యాపిటల్ మార్కెట్లలో ఈ సంస్థకు బలమైన స్థానం ఉంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లోని విభిన్న కంపెనీలు, ఆర్థిక సాధనాల్లో ఇది పెట్టుబడులు పెడుతుంది.
