పాన్ షాపులో గంజాయి అమ్మకాల
500 గ్రాముల గంజాయి ప్యాకెట్ల లభ్యం..
మీటా పాన్.. సాదా పాన్, కలకత్తా పత్తేకా పాన్, జర్థా పాన్ ఇలాంటి పాన్ల కోసం పాన్ ప్రియులు పాన్ షాప్‌కు పరుగులు పెడుతారు.
ఇంకొదరు నిషేదించిన సిగరెట్లు, గుట్కా పాన్ మాసాల కోసం వెళ్లె వాళ్లను చూస్తాం..
కాని… షాపులో గంజాయి ప్యాకెట్ల అమ్మకాలు జరుపుతున్న ఘటనను ఎస్టీఎఫ్ డీ టీం సీఐ నాగరాజు సిబ్బంది చూసి విస్తూ పోయారు.
ఈ సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎక్సైజ్ ఎస్టీఎప్ టీమ్ చందానాయక్ నగర్ మాదాపూర్ రోడ్డులో సోహల్ పాన్ షాపులో దాడి చేసి గంజాయి 500 గ్రాముల ప్యాకెట్లను పట్టుకున్నారు.

గంజాయిని దిగుమతి చేసుకోవడం.. లేదంటే గంజాయి 10 గ్రాముల ప్యాకెట్లను రూ.300 చొప్పున కొనుగోలు చేసి రూ.500 చొప్పున అమ్మకాలు జరుపుతు సొమ్ము చేసుకుంటున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
గంజాయి ప్యాకెట్లను పాన్ షాపులో అమ్మకాలు జరుపుతున్న మాలిక్ ఆస్లామ్ టామ్ బోలీ అనే వ్యక్తి అరెస్టు మాదాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
