పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు.
• బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన పెంచేందుకు ర్యాలీ నిర్వహణ
• వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు సాధ్యమనే సందేశం
• మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపు.
• అనుమానిత లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచన
• ఆరోగ్యకరమైన జీవనశైలి, ముందస్తు పరీక్షల ప్రాధాన్యతపై అవగాహన కల్పించిన నిర్వాహకులు
• పెద్ద సంఖ్యలో మహిళలు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలిపారు
• బ్రెస్ట్ క్యాన్సర్‌పై అపోహలను తొలగించి, మహిళల్లో ఆరోగ్యంపై చైతన్యం తీసుకురావడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.

