Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

బోథ్ నియోజకవర్గంలో ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమాల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా నేడు బోథ్ నియోజకవర్గంలోని బోథ్, సొనల, బజార్ హత్నూర్, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ గార్లతో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నూతన మండల కమిటీల ఏర్పాటులో ఎలాంటి వర్గ విభేదాలకు తావులేకుండా, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, పారదర్శకత ప్రాతిపదికగా కమిటీలను రూపొందించాలని సూచించారు. ఆగస్టు 15వ తేదీలోగా మండల కమిటీల నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని నాయకులు, కార్యకర్తలకు స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటయ్యే ప్రతి మండల కమిటీలో అధ్యక్షుడితో సహా మొత్తం 21 మంది సభ్యులు ఉంటారని వెల్లడించారు. వీటిలో ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు ,కార్యదర్శులు మరియు ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. విశేషంగా పార్టీ కమిటీల్లో మహిళా నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆదేశించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఐక్యత, క్రమశిక్షణ, సమిష్టి కృషి తప్పనిసరి అని నాయకులు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు. (PAC)మెంబెర్ ఏలేటి అశ్విన్ రెడ్డి ,బోథ్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ,ఆత్మ చైర్మన్ రాజు యాదవ్.బోథ్ మండల అధ్యక్షులు మేరుగు భోజన్న, సోనాల మండల అధ్యక్షులు గాజుల పోతన్న, బజార్ హత్నూర్ మండల అధ్యక్షులు కళ్లెం విట్టల్, గుడిహత్నూర్ మండల అధ్యక్షులు దౌలత్, తలమడుగు మండల అధ్యక్షులు కాస్లాల ప్రతాప్, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు ,మండల కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *