Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
Uncategorized

రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి శ్రీ గడ్డం వెంకటస్వామి (కాకా) గారి 97 వ జయంతి ఉత్సవాలు

పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్యే వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ వంశీ కృష్ణ, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, అంజన్ కుమార్ యాదవ్, సాంస్కృతిక శాఖ సెక్రెటరీ వాణి ప్రసాద్, ఇతర ముఖ్య నేతలు.మంత్రి పొన్నం ప్రభాకర్

కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్న

పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాకా వెంకటస్వామి గారు జీవితాంతం కృషి చేశారు

కాకా వెంకటస్వామి గారు తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రజానాయకులు

అణగారిన వర్గాల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా బలంగా గళం వినిపించిన నాయకుడు కాకా వెంకటస్వామి

రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయ సంబంధాలు కొనసాగించిన మహోన్నత వ్యక్తిత్వం

కాకా వెంకటస్వామి గారి సేవలు, ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

విద్య ద్వారా పేద, బడుగు వర్గాల పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నది కాకా వెంకటస్వామి గారి ప్రధాన ఆశయం

కాకా వెంకటస్వామి గారు చూపిన సామాజిక న్యాయం, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలి

ఆయన ఆశయాలను కొనసాగించడమే కాకా వెంకటస్వామి గారికి మనం అందించే నిజమైన నివాళి

కాకా వెంకట్ స్వామి గారు ఎవరైనా ఆయనను కలిసినప్పుడు, వారి స్థాయి, వారి రాజకీయ పక్షం, వారి నేపథ్యం చూడకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించడం, గౌరవించడం ఆయన వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం.

తన కొడుకు వ్యక్తిత్వాన్ని, తన కుటుంబ విలువలను ఎంతో గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తి వెంకట స్వామి గారు..

ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు, ఆయన చేసిన సేవలు మన మధ్యే ఉన్నాయి.ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యుల్లో, ఆయనతో కలిసి పనిచేసిన వారిలో, ఆయనను అభిమానించిన ప్రతి ఒక్కరిలో ఆయన జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి.

కాకా గారి ఆలోచన మన ప్రాంతం అభివృద్ధి చెందాలి.మన ప్రజల జీవితాల్లో మార్పు రావాలి.మన పిల్లలకు మంచి విద్య అందాలి.విద్య ద్వారా సమాజం ముందుకు వెళ్లాలి.

ఈ ఆలోచనలే ఆయనకు నిజమైన నివాళి.

ఆయన చూపించిన మార్గంలో మనం ముందుకు సాగుతూ, ఆయన ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయడం ద్వారానే ఆయనకు మనం నిజమైన గౌరవం ఇవ్వగలం.

ఈరోజు రాజకీయాల్లో ఎవరెక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, కాకా గారి సేవలను, ఆయన మంచితనాన్ని, ఆయన ఆలోచనలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.కాకా గారి కుటుంబంతో నాకు ఉన్న అనుబంధం కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఆయనను నేను nsui లో ఉన్నప్పటి నుండి ఆయనతో అవినవ భవ సంబంధం ఉంది..

కరీంనగర్ జిల్లాల్లో కాకా వెంకట్ స్వామి గారి, చొక్కరావు గారు, సత్యనారాయణ రావు గారు హేమాహేమీ లు రాజకీయ ఉద్ధండులు ఉన్నారు..

నేను ఎంపీగా ఉన్నప్పుడు వారి కుమారుడు వివేక్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్రం కోసం ఉద్యమించాల్సిన వాటిపై మాకు సలహాలు సూచనలు చేసేవారు..

వారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *