హైదరాబాద్: తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ ప్రొఫెసర్ కోదండరాం సార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫోరం నాయకులు ప్రొఫెసర్ కోదండరాం సార్ తో కేక్ కట్ చేయించి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు . తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని నాయకులు కొనియాడారు.
“తెలంగాణ సాధన కోసం సాగిన ప్రజా ఉద్యమానికి దిశానిర్దేశం చేసి, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం సార్ స్ఫూర్తి దివ్యాంగుల హక్కుల సాధన ఉద్యమానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు.
దివ్యాంగుల విద్య, ఉపాధి, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ కోసం మరింత ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ అశోక్ విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్ ఉపాధ్యక్షులు జి రేణుక సహాయ కార్యదర్శి డాక్టర్ జి నాగేశ్వర్ సభ్యులు కరుణాకర్ భువనేశ్వర్ శంకర్. రాములు. నరసింహ. స్వామి నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగ విద్యార్థులు మరియు తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు.
