Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు నేడు ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ.జీ. కాలనీ డివిజన్ యాదగిరి నగర్, జై భవాని నగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని రాష్ట్ర మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు,

శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు,

జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుద్ రెడ్డి గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట్ల రమణ రావు గారు, శ్రీమతి కాల్వ సుజాత గారు, శ్రీ బల్మూరి వెంకట్ గారు, శ్రీ రోహిన్ రెడ్డి గారు, శ్రీ సంపత్ కుమార్ గారు, శ్రీమతి కోట నీలిమ గారు, శ్రీ దీపక్ జాన్ గారు, శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు, జూపల్లి అరుణ్ గారు,శ్రీ జక్కిడి శివ చరణ్ రెడ్డి గారితో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ప్రజలందరికీ ఆషాడ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *