Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
తెలంగాణ

మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్మిదేవి మండలం జయశంకర్ కాలనీ వాసి మైనర్ బాలిక (7) కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుండి 8/10/2026 ఉదయం 11 గంటలకు తప్పిపోయింది. బాలిక తండ్రి కొత్తగూడెం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, మూడవ పట్టణ పోలీస్ అధికారులు వెంటనే రంగంలో దిగి సిసి కెమెరాలు ఆధారంగా ఆచూకీ కోసం రెస్క్యు ప్రారంభించారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ బానోత్ సందీప్, టీం సభ్యులు గాడిద భవానీ, ఆవునూరి భావన, దేవరకొండ రంజీత్ గాలింపు చర్యలు చేపట్టారు. కొత్తగూడెం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాలతో , పోలీస్ సిబ్బంది మరియు ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా టీం చేసిన ప్రయత్నాలు ఫలించి మైనర్ బాలిక ఆచూకీ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు రామవరం లో గుర్తించారు. బాలికను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు హజరు పరుచగా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రా దేవి మహమ్మద్ సాదిక్ పాషా బాలికను తండ్రి కి అప్పగించారు. ఇరవై నాలుగు గంటల్లోనే బాలిక ను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన కొత్తగూడెం మూడవ పట్టణ పోలీస్ సిబ్బందికి, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా టీం కు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రా దేవి, మహమ్మద్ సాదిక్ పాషా లు అభినందించారు. పద్దెనిమిది సంవత్సరాల లోపు బాల బాలికలు ఒంటరిగా ఎక్కడ అయిన కనబడితే వారి సమాచారం వెంటనే ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలియ చేయలని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు తెలియ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *