కారులో గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్.
దూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సీతారాం బాగ్ రోడ్ లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు దూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్ హెచ్ఓ, స్టేషన్ సీఐలు సిబ్బంది కలిసి మంగురు బస్తిలో కారులో గంజాయి పాకెట్లను అమ్మకాలు జరుపుతున్న మహిళను అరెస్ట్ చేశారు.
2.10 కేజీల గంజాయి ప్యాకెట్లతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు దూల్పేట్ ఎస్ హెచ్ ఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ప్రవీణ్ కుమార్ తో పాటు విప్లవ రెడ్డి, వెంకన్న సిఐలు జనార్దన్, సాబీర్ హెడ్ కానిస్టేబుల్ ఈ దాడిలో పాల్గొన్నారు.
ఈ కేసులో కే.రాజేశ్వరి అనే మహిళను అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న makan లాల్, రాం లాల్, లకన్ లాల్ కు సంబంధం ఉండడంతో వీరుపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
