Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్

అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్‌లో నిర్వహించిన పద్మశాలి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం  

ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ. “ప్రజాసేవలో ఉన్న పద్మశాలిలను, ప్రజాప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సన్మానించడం ఎంతో విశేషమైన కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. పద్మశాలి సమాజ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకం. మన సమాజం నుంచి ప్రజాసేవలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ గౌరవించుకోవడం మన బాధ్యత.”
“చేనేత, విద్య, ఉపాధి, వ్యాపారం, మహిళా సాధికారతతో పాటు యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం. పద్మశాలి సమాజం ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలంటే అందరం ఐక్యంగా పనిచేయాలి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పద్మశాలి కుటుంబానికి చేరేలా కృషి చేస్తాను” అని గూడూరు శ్రీనివాస్ అన్నారు. “ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల్లో పద్మశాలి సమాజ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ తెలంగాణ పద్మశాలి సహకార కార్పొరేషన్ అండగా ఉంటుంది. పద్మశాలి సమాజం అభివృద్ధి కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్ రమణ, కందగట్ల స్వామి, కామార్తపు మురళి, చేనేత కార్పొరేషన్ చైర్మన్ దుడెం వెంకటరమణ, తుడా చైర్మన్ గుండు సుధారాణి, రాపోలు జయప్రకాష్, చేనేత కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనిత, మరియు వివిధ జిల్లాల, ప్రాంతాలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, పద్మశాలి ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, చేనేత రంగ ప్రతినిధులు, మహిళా, యువజన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *