Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్

శ్రీ పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు కరీంనగర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ గారి 16 వ వర్ధంతి సందర్భంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం – 2026 కార్యక్రమం

వ్యవసాయం – ఎం.కోదండరెడ్డి, సాహిత్యం – వెలిచాల కొండల్ రావు ,కళలు – గొట్టే కనకవ్వ లకు శ్రీ పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం – 2026 అందించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్,పొన్నం ప్రభాకర్.

పురస్కార గ్రహీతలకు మెమెంటో తో పాటు 50 వేల రూపాయల నగదు పురస్కారం అందించిన మండలి చైర్మన్, మంత్రులు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం , ఫ్రొఫెసర్ హరగోపాల్,వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, వివిధ కార్పొరేషన్  చైర్మన్లు.

మంత్రి పొన్నం ప్రభాకర్

మా నాన్న గారు పొన్నం సత్తయ్య జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం ఈసారి వ్యవసాయం – ఎం.కోదండరెడ్డి
సాహిత్యం – వెలిచాల కొండల్ రావు
కళలు – గొట్టే కనకవ్వ లకు అందించడం జరుగుతుంది

ఇప్పటి వరకు సాహిత్యం కళలు మాత్రమే ఇచ్చేది

గత సంవత్సరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సూచనల మేరకు రైతు పొన్నం సత్తయ్య పేరు మీద రైతు అవార్డు కూడా బాగుంటుంది అన్నారు.

ఈ సంవత్సరం నుండి వ్యవసాయం లో కూడా ఇవ్వడం జరుగుతుంది.

గత నాలుగు సంవత్సరాలుగా విద్య, సామాజిక, కళా తదితర రంగాల్లో సేవలందించిన ప్రముఖులను పురస్కారాలతో సత్కరిస్తున్నాం.

ఈ ఐదవ సంవత్సరం నుంచి వ్యవసాయ రంగాన్ని కూడా పురస్కారాల్లో చేర్చాం.

కోదండరెడ్డి గారికి పురస్కారం రైతుల సమస్యల కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడిన నాయకుడు కోదండరెడ్డి గారు.

రైతుల హక్కులు, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు.

రైతుల పట్ల, పంటల పట్ల, వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, అనుబంధాన్ని గుర్తిస్తూ ఈ ఏడాది వ్యవసాయ రంగ పురస్కారం అందజేస్తున్నాం.

సాహిత్యం లో ఎన్నో రచనలు చేసిన వెలిచాల కొండల్ రావు గారికి ఇచ్చాం

జానపద కళా రంగంలో కనకవ్వ కు విశేష సేవలందించిన కళాకారులను కూడా ఈ సందర్భంగా సత్కరిస్తున్నాం.

మా తల్లిదండ్రులు చదువుకోకపోయినా వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టి మాకు విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు, సమాజం పట్ల బాధ్యతను నేర్పించారు.

వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న కుటుంబం కావడంతో రైతు కష్టం, వ్యవసాయం విలువ మాకు బాగా తెలుసు.

కుటుంబ సభ్యులందరి ప్రేమ, ఆప్యాయతలతోనే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాం.

కుటుంబం ఐక్యంగా, ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

గత నాలుగు సంవత్సరాల్లో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను పురస్కారాలతో సత్కరించాం.

ఈ అవార్డుల జ్యూరీ కమిటీ కన్వీనర్ డా. పొన్నం రవిచంద్ర సారధ్యంలో కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిసనర్ మాడభూషి శ్రీధర్, ప్రముఖ పాత్రికేయులు దిలీప్ రెడ్డి, సివిల్ సప్లయస్ డైరెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, బి. సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపుడి శ్రీలక్ష్మి లు ఎంపిక చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *