ప్రకటన న్యూస్ ప్రతినిధి. బి. అనిత
హైదరాబాద్, 21 జూలై, 2026: అడహాక్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించి వెంటనే రెగ్యులర్ చేయాలి
డాక్టర్ మాణిక్ రెడ్డి సత్యనారాయణ
మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్, కాకినాడ.
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న అడహాక్ మరియు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ అధినేత మాణిక్ రెడ్డి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నన్నయ విశ్వవిద్యాలయయంలో
ఎన్నో సంవత్సరాలుగా అతి తక్కువ జీతానికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా అభద్రతాభావంతో పనిచేస్తున్న అర్హత కలిగిన అడహాక్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను పరిగణలోనికి తీసుకొని వారిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో అధ్యాపక ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఆ పోస్టుల భర్తీకి ముందే కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించిన తరువాత మాత్రమే మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి అడహాక్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని మరియు యూనివర్సిటీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దోపిడీకి గురైన అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే ప్రభుత్వం మరియు యూనివర్సిటీ యాజమాన్యం స్పందించి వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలియజేశారు. భారత దేశ అత్యున్నత న్యాయస్థానమైన గౌరవ సుప్రీంకోర్టు కాంట్రాక్ట్ వ్యవస్థ పేరుతో సుదీర్ఘకాలం ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా కొనసాగించటం వారిని దోచుకోవటం దోపిడీ చేయడం అణిచివేయటమే అవుతుందని తెలియపరచినదని అదే విషయాన్ని గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఇదే విషయాన్ని తెలియజేసి ధృఢపరిచారని ప్రభుత్వం మరియు యూనివర్సిటీ యాజమాన్యాలు వెంటనే గౌరవ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాలను అనుసరించి అడహాక్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం ప్రభుత్వాన్ని కోరారు.
