Sat, 11 Jul 2026
🔴 BREAKING
ఆచార్య మాదిరాజు రంగారావు సాహిత్యం మానవ జీవన విలువలతో సుసంపన్నం: జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కరీంనగర్‌లో చెరువుల పునరుద్ధరణ పర్యవేక్షణ కట్టుదిట్టం నంద్యాల సమీపంలో జాతీయ రహదారి మరమ్మతు పనులు వేగం పుంజుకున్నాయి తదుపరి త్రైమాసికానికి గ్లోబల్ టెక్ సంస్థలు చిప్ సరఫరా ప్రణాళికలు సవరిస్తున్నాయి వైఎస్సార్ కడపలో యువ అథ్లెటిక్స్ శిక్షణ శిబిరం ప్రారంభం వర్షాకాల అవగాహన శిబిరాలను ఆరోగ్య బృందాలు విస్తరిస్తున్నాయి
Uncategorized

ఆచార్య మాదిరాజు రంగారావు సాహిత్యం మానవ జీవన విలువలతో సుసంపన్నం: జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి

హైదరాబాద్, 12 జూలై 2026: విశ్వనాథ సాహిత్య పీఠం, హైదరాబాద్, ఆచార్య మాదిరాజు రంగారావు రసధుని సాహితీ పరిషత్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య మాదిరాజు రంగారావు ప్రధమ వర్ధంతి సందర్భంగా గ్రీన్ పార్క్ హోటల్ లో ఆయన రచించిన ‘స్వేచ్ఛా కవిత్వం’ (11 సంపుటాలు), ‘సాహిత్యం విమర్శ’ (2 సంపుటాలు), ‘సాహితీ వైజయంతి’ గ్రంథాలను శనివారం జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి మాట్లాడుతూ, మాదిరాజు రంగారావు కవిత్వంలో జీవితానికి అన్వయించుకోవాల్సిన ఎన్నో విలువలు ఉన్నాయని అన్నారు. సాహిత్యం సామాజిక మార్పుకు సాధనంగా నిలవాలని, సమాజంలో జరుగుతున్న దారుణాలపై సాహితీవేత్తలు స్పందించి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాదిరాజు రంగారావు రచనలు మానవీయ విలువలకు ప్రతీకగా నిలుస్తాయని కొనియాడారు.

విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షులు డా. వెల్చాల కొండల్ రావు ప్రారంభోపన్యాసంలో మాదిరాజు రంగారావు స్వేచ్ఛా కవిత్వమంతా మానవతా దృక్పథంతో నిండి ఉందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య ‘తెలంగాణ స్వరం’ కవితా సంపుటి ద్వారా ఆయన కవితా హృదయం, తెలంగాణ ఆత్మ ఆవిష్కృతమైందని పేర్కొన్నారు.

ప్రధానోపన్యాసకులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ, కాల్పనిక కవిత్వం తర్వాత అభ్యుదయ కవిత్వ ఉద్యమాల నడుమ స్వేచ్ఛా కవిత్వానికి ప్రత్యేక దిశను చూపిన కవి మాదిరాజు రంగారావు అని అన్నారు. సాంస్కృతిక చైతన్యం, జాతీయ దర్శనం, ప్రకృతి, సామాన్య జీవితం వంటి అంశాలను ఆయన కవిత్వంలో సజీవంగా ప్రతిబింబించారని చెప్పారు.

జస్టిస్ మంగరి రాజేందర్ మాట్లాడుతూ, మాదిరాజు రంగారావు నిరాడంబర వ్యక్తిత్వం కలిగిన మహోన్నత సాహితీవేత్త అని, గొప్ప రచనలు చేసినా ప్రచారానికి దూరంగా ఉన్నారని కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు విజయ్ బాబు మాట్లాడుతూ, 170కి పైగా గ్రంథాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహోన్నత పండితుడు మాదిరాజు రంగారావు అని అన్నారు. ప్రాచీనత, ఆధునికతల సమన్వయం ఆయన రచనల్లో ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు.

సభను తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి కన్వీనర్‌గా నిర్వహించారు. ఆచార్య మాదిరాజు రంగారావు సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఆయన కుమారుడు సంతోష్, కుమార్తెలు హరిత, చరిత కలిసి ఆచార్య మాదిరాజు రంగారావు రసధుని సాహితీ పరిషత్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన కవులు, సాహితీవేత్తలను గౌరవించడంతో పాటు స్వేచ్ఛా కవిత్వాన్ని భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సాహిత్య యజ్ఞంలో రంగారావు కుటుంబ సభ్యులు భాగస్వాములు కావడం అభినందనీయమని, ఆయన సాహిత్య సంపదను గ్రంథరూపంలో అందుబాటులోకి తీసుకురావడంలో వారితో పాటు, డా. వెల్చాల కొండల్ రావు విశేష కృషి చేశారని కొనియాడారు.

కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు, కవులు ఆచార్య రామా చంద్రమౌళి, డా. ఎల్ ఎస్ ఆర్ ప్రసాద్, డా. నాళేశ్వరం శంకరం, లయన్ తమ్మెర లక్ష్మీ నరసింహారావు, డా. ఏల్చూరి మురళీధర్ రావు, శ్రీ శంకర నారాయణతో పాటు రచయితలు, అధ్యాపకులు, పరిశోధకులు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదిరాజు రంగారావు సాహిత్య సంపద భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని వక్తలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.

filter: 0; fileterIntensity: -0.01; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: night;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 42;
filter: 0; fileterIntensity: -0.01; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: night;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 32768;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 43;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *