వస్త్రప్రియుల్ని అలరిస్తున్న బ్రాండ్ ఆర్.ఎస్.బ్రదర్స్ తమ 20వ షోరూమ్‌ను సైదాబాద్, సంతోష్‌నగర్ సర్కిల్లో అక్టోబర్ 2న శుభారంభం చేశారు. ఈ సరికొత్త మెగా షాపింగ్‌మాల్ ఘనమైన ప్రారంభోత్సవం సుప్రసిద్ధ సినీతార నిధి అగర్వాల్ చేతుల మీదుగా జరగడం విశేషం.
ఈ శుభారంభం సందర్భంగా పెద్ద ఎత్తున విచ్చేసిన సందర్శకులను ఉద్దేశిస్తూ, నిధి అగర్వాల్- _“విశ్వసనీయతకు, సంప్రదాయ విలువలకు, అధునాతన ఫ్యాషన్లకు ఆర్.ఎస్.బ్రదర్స్ నిలువెత్తు ప్రతిబింబం”_ అన్నారు. ఈ వేడుకను తిలకించేందుకు విచ్చేసిన స్థానిక కుటుంబాల వారిని ఆర్.ఎస్.బ్రదర్స్ యాజమాన్యం హృదయపూర్వక స్వాగతం పలికింది.
కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులను, అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఫ్యాషన్లలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అందుబాటు ధరలలో విశ్వసనీయ వస్త్రవిశేషాల్నిఅందించడంలో తమ సంస్థ ఎప్పుడూ ప్రథమ శ్రేణిలోనే ఉంటుందని, ఎప్పటికప్పుడు సరికొత్త మైలురాళ్ళను అధిగమిస్తూ, ముందుకు సాగిపోతూ ఉంటుందని ఆర్.ఎస్. బ్రదర్స్ యాజమాన్యం వినమ్రంగా వెల్లడించింది. శ్రీ పి. వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్. రాజమౌళి, శ్రీ టి. ప్రసాదరావు, మరియు స్వర్గీయ శ్రీ పి. సత్యనారాయణ గారలు నెలకొల్పిన ఈ సంస్థ తన సుదీర్ఘ ప్రయాణంలో కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొని, మున్ముందుకు సాగిపోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ఈ విధంగా ప్రసంగించారు.
శ్రీ పి. వెంకటేశ్వర్లు (ఫౌండర్ & ఛైర్పర్సన్): _“అనేక దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మా సంస్థ మీ ఆశీస్సులతో 20వ షోరూమ్‌ను ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.
సైదాబాద్ మరియు ఆ పరిసర ప్రాంతాల వారి అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన వైవిధ్యభరిత వస్త్రశ్రేణిని, ఫ్యాషన్లను, అందుబాటు ధరలలో ఒకేచోట అందజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.”_
శ్రీ ఎస్. రాజమౌళి (ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్): _“సైదాబాద్‌లోని ఈ సరికొత్త మెగా షోరూమ్ వినూత్న షాపింగ్ అనుభూతి ని మీకు అందిస్తుందని, షాపింగ్ప్రియుల్ని తప్పకుండా అలరిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం. మీరు కోరుకునే వెరైటీ డిజైన్లు ఇక్కడ తప్పక లభిస్తాయి.”_
శ్రీ టి. ప్రసాదరావు (ఫౌండర్ & హోల్-టైం డైరెక్టర్): _“సైదాబాద్‌లోని మా కస్టమర్ల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడి సంతోష్‌నగర్ సర్కిల్‌కు మా మెగా షోరూమ్‌ను విస్తరించాం. ఈ ప్రాంతంలోని కుటుంబాలవారు మా సేవలను తప్పకుండా వినియోగించుకోగలరని విశ్వసిస్తున్నాం.”_
పవిత్ర దసరా నవరాత్రుల శుభసందర్భంగా పూర్తి కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్.ఎస్.బ్రదర్స్ అందిస్తున్న ప్రత్యేక కలెక్షన్లు:
మహిళల కోసం: అందమైన కంచి పట్టుచీరెలు, ఫ్యాన్సీ చీరెలు, భారతదేశ వ్యాప్తంగా మాస్టర్ వీవర్స్ రూపొందిస్తున్న కళాత్మక సమర్పణలు, పెళ్లి కుమార్తెకు వన్నె తెచ్చే వైవిధ్యభరిత సంప్రదాయ వస్త్రాలు
పురుషుల కోసం : అద్భుతమైన డిజైనర్ కుర్తాలు, సాంప్రదాయిక ఎత్నిక్ వస్త్రాలు, ఫార్మల్ సూట్స్, అధునాతన కాజువల్ స్టైల్స్
చిన్నారుల కోసం: ఆకర్షణీయమైన అందాల రంగుల్లో ఆకట్టుకునే ట్రెండీ ఫెస్టివల్ సూట్స్
ఆర్.ఎస్. బ్రదర్స్ అక్టోబర్ 2న సైదాబాద్, సంతోష్ నగర్ సర్కిల్ లో శుభారంభం చేసిన సరికొత్త
20వ మెగా షోరూమ్ కు విచ్చేసి, దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పూజలకు మీ కుటుంబసభ్యుల అవసరాలకు అనుగుణమైనవి, అదేవిధంగా ఆశ్వీయుజ మాసం వివాహ వేడుకలకు అచ్చంగా సరిపోయే వస్త్ర విశేషాలను కొనుగోలు చేయగలరని, ప్రారంభోత్సవ ఆఫర్లను వినియోగించుకో గలరని నిర్వాహకులు ఆశిస్తూ, అందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు.
