జలమండలిలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి రచించిన రామాయణ మహాకావ్యం, ఆయన బోధించిన నైతిక విలువలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్, టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, ఆపరేషన్స్ డైరెక్టర్లు నారాయణ, కిరణ్ కుమార్, సత్యనారాయణ, సీజీఎం రాజశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
