జూబ్లీహిల్స్ 28 జూలై : షేక్పేట్ ప్రాంతంలో తప్పిపోయి రోడ్డుపై ఏడుస్తున్న హాసన్ అనే ఐదేళ్ల చిన్నారిని చూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ వెంటనే తన వాహనాన్ని ఆపి బాలుడి వద్దకు వెళ్లారు. చిన్నారిని ఓదారుస్తూ “ఏడవద్దు” అని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, అతని పేరు, చిరునామా వంటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి, చిన్నారిని పోలీసులకు సురక్షితంగా అప్పగించారు.పోలీసుల సహకారంతో బాలుడిని అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా చేర్చారు. తమ కుమారుడిని సురక్షితంగా తిరిగి అందించినందుకు ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు ఎమ్మెల్యే చూపిన మానవత్వాన్ని, తక్షణ స్పందనను అభినందించారు.
తప్పిపోయిన చిన్నారిని కుటుంబ సభ్యులకు చేర్చిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్.
