Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ప్రకటన న్యూస్

ఆపరేషన్ ముస్కాన్ పై అదనపు కలెక్టర్ రివ్యూ

కొత్తగూడెం, 17 జూలై, 2026  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటవ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరుగుతున్న ఆపరేషన్ ముస్కాన్ – 12 లో మొదటి పదిహేను రోజుల రెస్క్యు పూర్తి కావడం తో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా మరియు ఇతర జిల్లా విభాగాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడిస్ శ్రీమతి విద్యచందన కలేక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పదిహేను రోజులు గా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ లో ఎంత మంది బాల కార్మికులకు విముక్తి కలిగించారు. ఏన్ని కేసులు నమోదు అయ్యాయి. ఎంత మంది బాల బాలికలను రెస్క్యు చేయడం జరిగింది అనే అంశాలపై అధికారులతో పూర్తి సమాచారం తెలుసుకున్నారు.

ఛైల్డ్ మ్యారేజ్ కేసులు, ఛైల్డ్ లేబర్ కేసులు రిపోర్ట్ అయిన వెంటనే యఫ్ఐఆర్ నమోదు చేసి, భాదిత బాల బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి పునరాసం కల్పించాలని అధికారును ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా ఆపరేషన్ ముస్కాన్ 12 రిపోర్ట్ కు సంబంధించిన పూర్తి రిపోర్ట్ ను కలేక్టర్ కు అందచేసి ఈ రోజు వరకు ఉన్న రిపోర్ట్ ఆధారం గా మరో పదిహేను రోజులు కుడా లైన్ డిపార్ట్‌మెంట్ లో అందరు పని చేసి రాష్ట్ర స్థాయి లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ లో మంచి ఫలితాలు వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు లేనినా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రా దేవి, మహమ్మద్ సాదిక్ పాషా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తూకారం రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, జిల్లా మైనార్టీ అధికారి అరుణ, లేబర్ ఆఫిసర్ నాగరాజు, డిపిఓ నవిన్, డిసిపివో హరి కుమారి, పోలీస్ శాఖ నుండి షీటీం యస్ఐ రమాదేవి, ఇతర జిల్లా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *