ప్రకటన న్యూస్ ప్రతినిధి: బి. అనిత
హైదరాబాద్, 15 జూలై, 2026: సాయంత్రం రవీంద్రభారతి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ మధుర గాయని ‘సోమా డాలీ’ హిందీ హిట్ పాటల ముజికల్ నైట్ ‘హమీద్ కమల్’, కామెడీ కింగ్ ‘ఖాదర్ షరీఫ్’ కామెడీ కి షామ్ కార్యక్రమం శ్రవనానందకరంగా సాగింది, ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. ఈ మ్యూజికల్ నైట్ అండ్ కామెడీ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫస్ట్ ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా ‘ఇఫ్తేఖర్ షరీఫ్” హాజరై పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘సోమా డాలీ’ ను ఇతర గాయనీ గాయకులను కామెడీ కళాకారులను అభినందించి సత్కరించారు.
