హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణకాంత్ పార్క్ వద్ద ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
బతుకమ్మ పూల అలంకరణలు, మహిళల ఆటపాటలతో కృష్ణకాంత్ పార్క్ పరిసర ప్రాంతం సందడిగా మారింది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో సాగాయి. భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో వేడుకలను తిలకించేందుకు వచ్చిన వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఆటపాటలు, కోలాహలంతో వేడుకల ప్రాంగణం మార్మోగింది. నవీన్ యాదవ్ సతీమణి వర్షా యాదవ్, సోదరుడు వెంకట్ యాదవ్, కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకుడు దేవి రెడ్డి నాగార్జున రెడ్డి, కొల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
కృష్ణ కాంత్ పార్క్ ప్రాంగణంలో బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి యూసఫ్‌గూడ సర్కిల్ నంబర్ 38 ఉప కమిషనర్ సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పార్కు ప్రాంగణంలో తాత్కాలికంగా నీటి పాండ్ ను ఏర్పాటు చేశారు.
