వరంగల్, జూలై 27, 2026: భారతదేశంలోని ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్ ఉబర్, వరంగల్ నగరంలో ఉబర్ బైక్ సేవలను ప్రారంభిస్తున్నట్లు నేడు ప్రకటించింది.
నగరంలో వేగవంతమైన, సరసమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ సేవ లక్ష్యం. ఉద్యోగానికి లేదా కళాశాలకు వెళ్లడం, రోజువారీ పనులు చక్కబెట్టుకోవడం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను కలుసుకోవడం వంటి అవసరాల కోసం ఇకపై ప్రయాణికులు ఉబర్ యాప్‌లో కేవలం కొన్ని ట్యాప్‌లతో బైక్ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. అదే సమయంలో, స్థానిక డ్రైవర్లకు తమకు అనుకూలమైన సమయాల్లో ఆదాయాన్ని పొందే అవకాశాలను ఉబర్ బైక్ అందిస్తుంది.
ఈ సేవ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, వరంగల్‌లోని కొత్త ప్రయాణికులందరికీ పరిమిత కాలం పాటు మొదటి ఉబర్ బైక్ రైడ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ఉబర్ ప్రకటించింది. తద్వారా వారు ఈ సేవను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం పొందనున్నారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణలోని వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కె. ఆర్. నాగరాజు, తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తోట పవన్ కలిసి ఉబర్ బైక్ డ్రైవర్లకు ఐ.ఎస్.ఐ. ప్రమాణాలకు అనుగుణంగా ధృవీకరించబడిన హెల్మెట్లను పంపిణీ చేశారు. సురక్షితమైన రహదారులు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించాలనే ఉమ్మడి సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలిచింది.తెలంగాణలోని వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కె. ఆర్. నాగరాజు మాట్లాడుతూ ఇలా అన్నారు, “వరంగల్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉండే, సరసమైన ధరలో లభించే, విశ్వసనీయమైన రవాణా సేవల అవసరం మరింత పెరిగింది. ఉబర్ బైక్ ప్రారంభంతో నగరవాసులు నగరంలోని వివిధ ప్రాంతాలకు మరింత సులభంగా ప్రయాణించగలుగుతారు. అదే సమయంలో స్థానిక డ్రైవర్లకు అనువైన, సౌలభ్యవంతమైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.
“రహదారి భద్రత కూడా అంతే ముఖ్యమైనది. ప్రమాదం జరిగిన అనంతర తొలి గంటలో ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంతో పాటు, తన యాప్‌లో అందుబాటులో ఉన్న భద్రతా ఫీచర్ల ద్వారా ఈ ప్రారంభ కార్యక్రమంలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చినందుకు ఉబర్‌ను అభినందిస్తున్నాను. వరంగల్‌లో ఉబర్ బైక్ సేవలు ప్రారంభం కావడాన్ని నేను హర్షిస్తున్నాను. నగర అభివృద్ధి, పురోగతిలో భాగస్వామిగానిలవబోతున్న ఉబర్ బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.”తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తోట పవన్ మాట్లాడుతూ, “విశ్వసనీయమైన, అందుబాటులో ఉండే రవాణా సదుపాయాలు ఆర్థికాభివృద్ధికి, సామాజిక సమ్మిళితత్వానికి కీలకమైన ప్రేరకశక్తిగా నిలుస్తాయి. వరంగల్‌లో ఉబర్ బైక్ సేవలు ప్రారంభం కావడం ద్వారా నగరంలో మొదటి దశ, చివరి దశ ప్రయాణ అనుసంధానం మెరుగుపడటమే కాకుండా, ప్రజలకు సరసమైన ధరలో సౌకర్యవంతమైన ప్రయాణ ప్రత్యామ్నాయం అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో, అనేక మంది స్థానిక రైడర్లకు సౌలభ్యవంతమైన జీవనోపాధి అవకాశాలు కూడా లభించి, నగర ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. ఈ సేవలను విజయవంతంగా ప్రారంభించినందుకు ఉబర్‌ను అభినందిస్తున్నాను. వరంగల్ ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తూ, నగరాన్ని మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా, మెరుగైన అనుసంధానంతో కూడిన రవాణా వ్యవస్థ వైపు తీసుకెళ్లే ప్రయాణంలో ఉబర్ బృందం నిరంతర విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.
ఉబర్ ఇండియా మరియు దక్షిణాసియా – కన్సూమర్ మరియు గ్రోత్ విభాగం డైరెక్టర్ రిషాంత్ ఘోష్ మాట్లాడుతూ: వరంగల్‌లో ఉబర్ బైక్ సేవలను ప్రారంభించి, నగర రవాణా వ్యవస్థలో భాగం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతదేశవ్యాప్తంగా రోజువారీ ప్రయాణాలకు, ముఖ్యంగా స్వల్ప దూర ప్రయాణాలు, ప్రయాణంలో మొదటి మరియు చివరి మైలు కనెక్టివిటీ కోసం బైక్ ట్యాక్సీలు సరసమైన, విశ్వసనీయమైన రవాణా మార్గంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని మరిన్ని నగరాలకు విస్తరించేందుకు మేము కృషిని మరింత వేగవంతం చేస్తున్నాం. ప్రతి రైడ్‌లోనూ భద్రతకు అత్యంత ప్రాధాన్యం కొనసాగుతుంది. వరంగల్ నగరవాసులకు విశ్వసనీయమైన రవాణా ఎంపికగా నిలవడంతో పాటు, స్థానికులకు తమకు అనుకూలమైన సమయాల్లో ఆదాయాన్ని పొందే అవకాశాలను కల్పించేందుకు మేము ఎదురుచూస్తున్నాం” అని అన్నారు. ప్రతి ఉబర్ బైక్ రైడ్‌కు డ్రైవర్ రియల్‌టైమ్ ఐడీ చెక్, యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్, 24×7 సేఫ్టీ లైన్, షేర్ ట్రిప్ స్టేటస్ వంటి అనేక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
ఉబర్ బైక్‌ను బుక్ చేసుకోవడం ఎలా ఉబర్ బైక్‌ను బుక్ చేసుకోవడం చాలా సులభం:
• ఉబర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి లేదా ఓపెన్ చేయండి
• మీ పికప్ మరియు డ్రాప్-ఆఫ్ ప్రదేశాలను నమోదు చేయండి
• అందుబాటులో ఉన్న రైడ్ ఆప్షన్లలో ఉబర్ బైక్ ను ఎంచుకోండి
• మీ ట్రిప్‌ను నిర్ధారించండి. సమీపంలోని డ్రైవర్‌తో మీ రైడ్ మ్యాచ్ అవుతుంది
• మీ రైడ్‌ను రియల్‌టైమ్‌లో ట్రాక్ చేస్తూ, మీ ప్రయాణాన్ని ఆస్వాదించండి
