Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

సెప్టెంబర్ 1 – పెన్షన్ విద్రోహ దినం / “బ్లాక్ డే” గా ఉద్యోగుల నిరసన

CPS విధానాన్ని రద్దు చేసి OPSను పునరుద్ధరించాలి: TGEJAC హైదరాబాద్ సిటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 1, 2026: CPS విధానానికి వ్యతిరేకంగా  సెప్టెంబర్ 1ను ఉద్యోగులు బ్లాక్ డే / పెన్షన్ విద్రోహ దినంగా పాటించారు.

TGEJAC హైదరాబాద్ సిటీ చైర్మన్ కట్టకూరి శ్రీకాంత్, కన్వీనర్ గండూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని భీమా భవన్, అబిడ్స్ మరియు ఎకనామిక్స్ & స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్, ఖైరతాబాద్ వద్ద HoD ఉద్యోగుల ఆధ్వర్యంలో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని CPS విధానాన్ని రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని నినదించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TGEJAC చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ శ్రీ ఎలూరి శ్రీనివాసరావు గారు హాజరై ఉద్యోగుల పోరాటానికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ CPS విధానాన్ని తక్షణమే రద్దు చేసి, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న నిర్వహించనున్న “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

ప్రధాన డిమాండ్లు

🔴 CPS విధానాన్ని రద్దు చేసి OPSను వెంటనే పునరుద్ధరించాలి.
🔴 2వ PRCని వెంటనే అమలు చేయాలి.
🔴 పెండింగ్‌లో ఉన్న 6 విడతల DA & DRను వెంటనే విడుదల చేయాలి.
🔴 పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.
🔴 నూతన EHSను సమర్థవంతంగా అమలు చేయాలి.
🔴 HoD ఉద్యోగులకు సెక్రటేరియట్‌లో 12.5% కోటాను వెంటనే అమలు చేయాలి.
🔴 సెప్టెంబర్ 10న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి.

ఈ కార్యక్రమంలో ముజీబ్ హుస్సేన్ టీఎన్జీఎస్ జనరల్ సెక్రెటరీ శ్యామ్ టీజీవోస్ జనరల్ సెక్రెటరీ ముత్యాల సత్యనారాయణ గౌడ్ కస్తూరి వెంకటేశ్వర్లు ఉమాదేవి శైలజ చంద్రశేఖర్ కొండల్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి TGEJAC హైదరాబాద్ సిటీ నాయకులు, లక్ష్మణ్ నిరంజన్ రెడ్డి హరికృష్ణ మహేందర్ రావు అమరేందర్ బాబు శంకర్ మహేష్ గౌడ్ వరలక్ష్మి ప్రభాకర్ మోహన్ విజయ్ రమేష్ అర్మని రాజు పి లక్ష్మీ నరసింహస్వామి ప్రభాకర్ రెడ్డి లక్ష్మీ బాలాజీ వివిధ శాఖల HoD ఉద్యోగులు, సంతోష్ బాల నర్సింగరావు పేరెంట్ అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీను ఎకనామి క్రైమ్ స్టేటస్ డిపార్ట్మెంట్ దేవేందర్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ నుంచి మధు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఈశ్వర్ ఆనంద్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ విలియమ్స్ సతీష్ శర్మ లేబర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ మహేందర్ యూనిట్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *