Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
Uncategorized

ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహిమత్ నగర్ డివిజన్ వినాయక రావు నగర్ మరియు కార్మికనగర్ డివిజన్‌లోని ఎస్‌ఎన్‌బీ నగర్‌లో నిర్వహించిన తొట్టెల కార్యక్రమాల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు.

బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న భక్తులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *