Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 27-08-2026న ఇందిరా పార్క్ వద్ద TGEJAC ధర్నా

ఈరోజు   టీజీవో భవనంలో టీజీవో హైదరాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం . హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబి.కృష్ణ యాదవ్. కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఖాదర్. ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా tgos రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ గారు మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా ఉద్యోగులు అందరూ 27 తారీఖు నాడు జరిగే నిరసన దినాన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్ జిల్లా శాఖ పరిధిలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం TGEJAC రాష్ట్ర బాడీ పిలుపు మేరకు 27-08-2026న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు TGO’s హైదరాబాద్జిల్లా శాఖ బాడీ ప్రకటించింది.

ఈ సందర్భంగా 22-08-2026న జరిగిన TGO’s హైదరాబాద్జిల్లా శాఖ బాడీ సమావేశంలో ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యాచరణపై చర్చించారు.

ప్రధాన డిమాండ్లు:

🔴 2వ PRCని వెంటనే అమలు చేయాలి.
🔴 పెండింగ్‌లో ఉన్న 6 విడతల DA & DRను వెంటనే విడుదల చేయాలి.
🔴 CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలి.
🔴 టిజిఓ హైదరాబాద్ జిల్లా వార్షిక మెంబర్షిప్ డ్రైవ్ 2026.
🔴 నూతన EHSను సమర్థవంతంగా అమలు చేయాలి.
వారానికి ఐదు రోజులు జిహెచ్ఎంసి పరిధిలోని ఏరియా ఉద్యోగులందరుకు వెసులుబాటు కల్పించాలని కోరారు..
హైదరాబాద్ dist పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులు 27-08-2026న ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై, మన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని TGO’S హైదరాబాద్ జిల్లా శాఖ బాడీ పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో జి ఆశన్న. ఎన్జీల రెడ్డి. వెంకటరమణ. డాక్టర్ ఎం సురేందర్. ఏ రాజేందర్. ఎం శ్రీనివాసులు. రాధాకృష్ణ. డాక్టర్ సునీత జోషి. జి ప్రభాకర్. విద్యాసాగర్. పేరయ్య. డాక్టర్ బి కుమార్. డాక్టర్ జి గాయత్రీ దేవి. వి స్వప్నిల్. చాంద్ బాషా.గౌస్. శోకతు హుస్సేన్. ఏం రవీందర్. వివేకానంద రెడ్డి. బి జ్యోతి. టీవీ సరస్వతి. డాక్టర్ వి సాయి బాబా. జిఎస్ చంద్రజ్యోతి.పూనం తదితరులు పాల్గొన్నారు
మన హక్కుల కోసం – మన డిమాండ్ల సాధన కోసం – ఐక్యంగా పోరాడుదాం!

TGO’S హైదరాబాద్ Dist బాడీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *