Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ఎస్సీ–ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం ఆధ్వర్యం లో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ గడ్డం మల్లేశం గారు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఘన సన్మానం

హైదరాబాద్, ఆగస్టు 7, 2026 : వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ గడ్డం మల్లేశం గారు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్సీ–ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం ఆధ్వర్యంలో, మాజీ చీఫ్ సెక్రటరీ శ్రీ కాకి మాధవరావు గారి నేతృత్వంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్‌లోని అంబేద్కర్ భవన్, లోయర్ ట్యాంక్ బండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, గ్రూప్–1 అధికారులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాల నాయకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు పాల్గొని ప్రొఫెసర్ గడ్డం మల్లేశం గారికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ESI డైరెక్టర్ డాక్టర్ గౌతమ్, డాక్టర్ సిద్ధోజ్, డాక్టర్ ప్రకాష్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మంగు గారు, మాజీ హెడ్ ప్రొఫెసర్ విద్యాసాగర్, మరో మాజీ హెడ్ ప్రొఫెసర్ రమణ రావు, ప్రొఫెసర్లు, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుగూరి బాబు, అడ్వకేట్ లక్ష్మణ్, ఇంజనీరింగ్ స్కాలర్ కృష్ణ రాథోడ్, పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, స్కాలర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ గడ్డం మల్లేశం గారు విద్యా రంగంలో విశేష అనుభవం కలిగిన విద్యావేత్తగా, పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తిగా, సామాజిక స్పృహతో పనిచేసే ప్రముఖుడిగా పలువురు వక్తలు కొనియాడారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని విద్య, సమానత్వం, మహిళా సాధికారతకు ఒక ఆదర్శ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడంలో ఆయన నాయకత్వం కీలకంగా ఉంటుందని వారు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో గొప్ప గొప్ప పదవులు చేపట్టాలని పలువురు కొనియాడారు

ఈ సందర్భంగా ప్రొఫెసర్ గడ్డం మల్లేశం గారు మాట్లాడుతూ, మహిళల ఉన్నత విద్యాభివృద్ధి, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సాధికారతకు విశ్వవిద్యాలయం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు.

“విద్య ద్వారా సాధికారత – సమాజ అభివృద్ధికి బలమైన పునాది” అనే లక్ష్యంతో విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *