Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
Uncategorized

కెఎంఐసీఎస్‌లో “వికసిత్ భారత్@2047 – AI-Driven Commerce Education and Skill 5.0”పై జాతీయ సెమినార్

హైదరాబాద్, సెప్టెంబర్ 18: కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ (KMICS)లో కామర్స్ విభాగం మరియు IQAC ఆధ్వర్యంలో “Viksit Bharat@2047 – AI-Driven Commerce Education and Skill 5.0” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగారం ముఖ్య అతిథిగా హాజరై సెమినార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ భారతదేశ నిర్మాణంలో కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్ & ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇంద్రకంటి శేఖర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి KMES కార్యదర్శి డాక్టర్ ఏ.వి. సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో విద్యాసంస్థలు, అధ్యాపకులు, విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
ఈ జాతీయ సెమినార్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని కృత్రిమ మేధస్సు, కామర్స్ విద్యలో సాంకేతిక పరిజ్ఞానం, నూతన నైపుణ్యాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు, వికసిత్ భారత్@2047 లక్ష్య సాధనలో విద్యా రంగం పాత్ర వంటి అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు. సెమినార్ ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *