Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
Uncategorized

పాన్ షాపులో గంజాయి అమ్మకాలు

500 గ్రాముల గంజాయి ప్యాకెట్ల లభ్యం. మీటా పాన్.. సాదా పాన్, కలకత్తా పత్తేకా పాన్, జర్థా పాన్ ఇలాంటి పాన్ల కోసం పాన్ ప్రియులు పాన్ షాప్‌కు పరుగులు పెడుతారు.

ఇంకొదరు నిషేదించిన సిగరెట్లు, గుట్కా పాన్ మాసాల కోసం వెళ్లె వాళ్లను చూస్తాం..

కాని… షాపులో గంజాయి ప్యాకెట్ల అమ్మకాలు జరుపుతున్న ఘటనను ఎస్టీఎఫ్ డీ టీం సీఐ నాగరాజు సిబ్బంది చూసి విస్తూ పోయారు.

ఈ సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎక్సైజ్ ఎస్టీఎప్ టీమ్ చందానాయక్ నగర్ మాదాపూర్ రోడ్డులో సోహల్ పాన్ షాపులో దాడి చేసి గంజాయి 500 గ్రాముల ప్యాకెట్లను పట్టుకున్నారు.

గంజాయిని దిగుమతి చేసుకోవడం.. లేదంటే గంజాయి 10 గ్రాముల ప్యాకెట్లను రూ.300 చొప్పున కొనుగోలు చేసి రూ.500 చొప్పున అమ్మకాలు జరుపుతు సొమ్ము చేసుకుంటున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.

గంజాయి ప్యాకెట్లను పాన్ షాపులో అమ్మకాలు జరుపుతున్న మాలిక్ ఆస్లామ్ టామ్ బోలీ అనే వ్యక్తి అరెస్టు మాదాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *