హాంగ్జౌ, చైనాలో జరిగిన ISSF వరల్డ్ కప్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన ప్రముఖ షూటర్ ఈషా సింగ్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సోని బాలాదేవి సన్మానించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఈషా సింగ్‌కు డాక్టర్ సోని బాలాదేవి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె సాధించిన ఈ విజయం దేశ కీర్తిని అంతర్జాతీయ వేదికపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. పిస్టల్ షూటింగ్ విభాగంలో వరుసగా రెండు ప్రపంచకప్ స్వర్ణ పతకాలను గెలుచుకున్న తొలి షూటర్‌గా ఇషా సింగ్ చరిత్ర సృష్టించడం ఎంతో గర్వకారణమని ఆమె కొనియాడారు.
భవిష్యత్తులోనూ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించి భారతదేశానికి, తెలంగాణకు మరిన్ని అంతర్జాతీయ కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, ఇషా సింగ్‌కు డాక్టర్ ఎ. సోని బాలాదేవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
షూటర్ ఇషా సింగ్‌కు స్పోర్ట్స్ అథారిటీ సన్మానం
