Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
Uncategorized

సంగారెడ్డి అభివృద్ధికి మరో ముందడుగు 31, 11వ వార్డుల్లో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 31వ, 11వ వార్డుల్లో సుమారు రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ ప్రారంభించారు.

ముఖ్య అతిథి నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి పట్టణంలోని అన్ని వార్డులు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి పనిచేస్తున్న మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్‌తో పాటు పాలకవర్గాన్ని అభినందించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ మాట్లాడుతూ, సంగారెడ్డి పట్టణంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సతీశ్ రెడ్డి, దశరథ్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, తులసిరామ్, శ్రీశైలం, అన్వర్, రామచందర్ గౌడ్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *