Wed, 09 Sep 2026
🔴 BREAKING
మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ 35 కుటుంబాలకు CMRF చెక్కుల పంపిణీ
Uncategorized

సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్

‘నైరా’ ఆవిష్కరణతో, సహజ రత్నాలను మరియు సాంప్రదాయ పనితనంను వేడుకగా జరుపుకుంటున్న జెమ్హన్ జ్యువెలరీ ఫెస్టివల్

నేషనల్ | సెప్టెంబర్ 06, 2026: ప్రపంచంలో నాల్గవ అతి పెద్ద ఆభరణాల రిటైలర్ గా, ‘ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్’ గా గుర్తింపు పొందిన మలబార్ గోల్డ్ & డైమండ్స్, ప్రకృతిలోని అత్యంత సహజసిద్ధమైన రత్నాలను తరతరాలు మెచ్చే ఆభరణాలుగా మలిచి ‘నైరా’ పేరిట తమ కొత్త సహజ రత్నాల ఆభరణాల కలెక్షన్ ను విడుదల చేసింది. ప్రముఖ నటి, మోడల్ శ్రీనిధి శెట్టి ఈ కలెక్షన్ కు ముఖచిత్రంగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో నిర్వహిస్తోన్న ఈ బ్రాండ్ యొక్క ‘జెమ్న్ జ్యువెలరీ ఫెస్టివల్’కి ఈ ఆవిష్కరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఉత్సవంలో భాగంగా వినియోగదారులు రత్నాలు మరియు అన్ కట్ ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ 14 సెప్టెంబర్ 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన అరుదైన సంపదల శాశ్వత సౌందర్యం నుంచి స్పూర్తి పొందిన ‘నైరా’, సంప్రదాయ చిల్లె, పచ్చి ఆభరణాల తయారీ కళలోని నైపుణ్యాన్ని ఆధునిక రూపంలో ఆవిష్కరిస్తోంది. బంగారంతో రూపొందించి, విలువైన సహజ రత్నాలతో పొదిగిన ఈ కలెక్షన్, శిల్ప రూపాలను మరియు క్లిష్టమైన అంశాలను ఒకచోట చేర్చి సాంప్రదాయ రత్నాల ఆభరణాలకు ఒక సరికొత్త రూపాన్ని అందిస్తుంది. కొత్త తరం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ‘నైరా’, సహజ రత్నాలతో రూపొందించిన ఆభరణాలను సరికొత్త డిజైన్ శైలిలో పరిచయం చేస్తోంది. ఈ కలెక్షన్లోని అద్భుతమైన పనితనం, రత్నాల ప్రత్యేకత, విలక్షణమైన సౌందర్యాన్ని ప్రధానంగా ఆవిష్కరిస్తోంది. సాంప్రదాయ ఆభరణాల తయారీ నైపుణ్యాన్ని, అభివృద్ధి చెందుతున్న డిజైన్ అభిరుచులను, వినియోగదారుల ప్రాధాన్యతలను మేళవించడంపై మలబార్ గోల్డ్ డైమండ్స్ యొక్క దృష్టిని ఈ కలెక్షన్ ప్రతిబింబిస్తుంది.

కొత్తగా విడుదల చేసిన నైరా కలెక్షన్తో పాటు, జెమ్హన్ జ్యువెలరీ ఫెస్టివల్ కోసం మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారిచే ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన రత్నాలు మరియు అన్ కట్ ఆభరణాల శ్రేణి ద్వారా సహజ రత్నాలను ప్రదర్శిస్తుంది. దీనికి తోడు, ఈ ఫెస్టివల్లో వినియోగదారులకు అనుకూలమైన కొనుగోలు అనుభవాలను కల్పిస్తూ, సహజ రత్నాల ఆభరణాల ప్రపంచాన్ని మరింతగా తెలుసుకునే, పరిశీలించే అవకాశాన్ని కల్పిస్తోంది.

నైరా కలెక్షన్ ఆవిష్కరణ తో పాటుగా జెమ్హన్ జ్యువెలరీ ఫెస్టివల్ ప్రారంభంపై మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం. పి. అహ్మద్ మాట్లాడుతూ “రత్నాల ఆభరణాలు ప్రకృతి సౌందర్యాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని మరియు ప్రతి కస్టమర్ యొక్క వ్యక్తిత్వాన్ని ఒకచోట చేర్చుతాయి. ‘నైరా’ ద్వారా సహజ రత్నాలను సరికొత్త డిజైన్, అత్యున్నత పనితనంతో ఆవిష్కరించాలనుకున్నాం. అదే సమయంలో రత్నాభరణాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చే కళాత్మకత, సహజ స్వభావాన్ని కాపాడేలా ఈ కలెక్షన్ను తీర్చిదిద్దాం.

బాధ్యతాయుతమైన ఆభరణాల వ్యాపారిగా, నాణ్యత, పారదర్శకత మరియు నమ్మకమైన కొనుగోలు ప్రమాణాలకు భరోసానిచ్చే ఆభరణాలను వినియోగదారులకు అందించడం పైనే మా దృష్టి కొనసాగుతోంది. ‘జెమోన్ జ్యువెలరీ ఫెస్టివల్’ ద్వారా, ఈ ప్రత్యేకమైన శ్రేణిని మరియు ‘నైరా’ కలెక్షన్ను మా కీలక మార్కెట్లలోని వినియోగదారులకు మరింత చేరువ చేయాలని కోరుకుంటున్నాము” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *