మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క
తెలంగాణ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ రాఖీ శుభాకాంక్షలు
ప్రతి సోదరుడు సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుంది
వారి రక్షణ కోసం కట్టే రాఖీ బంధము
12 సంవత్సరాలుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను రాఖీ కడుతూనే ఉన్నాను
ఒక ఆదివాసి బిడ్డను, అడవి బిడ్డను, మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆడబిడ్డను ఈ స్థాయికి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర కృషి చాలా ఉంది
వారి సహకారం మరువలేనిది
ప్రతి ఏడాది ములుగు నియోజకవర్గ ప్రజలకు రాఖీ కట్టి సంప్రదాయాన్ని ప్రారంభిస్తాను
ములుగు ప్రజల ఆశీస్సులు దీవెనలతో ఈ నా జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తున్న
నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ములుగు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
సోదరుడు సీఎం రేవంత్ రెడ్డికి చాలామంది మహిళలు, సహచర మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ మహిళా నాయకులు, బ్రహ్మకుమారీలు వచ్చి రాఖీలు కట్టారు
వందల మంది మహిళలు వచ్చినా ఓపిగ్గా సీఎం గారు రాఖీ కట్టించుకుంటున్నారు
