Wed, 09 Sep 2026
🔴 BREAKING
మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ 35 కుటుంబాలకు CMRF చెక్కుల పంపిణీ
Uncategorized

35 కుటుంబాలకు CMRF చెక్కుల పంపిణీ

పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF అండగా నిలుస్తోంది : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 35 కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను శనివారం పికెట్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ అనారోగ్యంతో వైద్యం చేయించుకునే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని కుటుంబాలకు CMRF ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు.

నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, CMRF లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *