కూకట్‌పల్లిలో కొరియన్ డెర్మా క్లినిక్‌ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లినిక్ నిర్వాహకులు, ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డా. ప్రణయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో చర్మవ్యాధులు, జుట్టు సమస్యలు, లేజర్ చికిత్స, కాస్మెటిక్ మరియు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
కూకట్పల్లి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, డా. ప్రణయ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.
