సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈఓ శ్రీమతి దివ్య దేవరాజన్ IAS గారు నేడు టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా క్యాంటీన్లో కిచెన్, డిష్ వాషింగ్, స్టోర్ రూమ్ యూనిట్, పరిశుభ్రత ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించిన ఆమె, మహిళా సంఘాల సాధికారత కోసం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ గారు తీసుకున్న ప్రత్యేక చొరవను అభినందించారు.
క్యాంటీన్ నిర్వహణలో భాగస్వామ్యమైన మహిళలతో మాట్లాడిన శ్రీమతి దివ్య దేవరాజన్ గారు, ఉద్యోగులకు అందిస్తున్న సేవలు, రోజువారీ మరియు నెలవారీ వ్యాపార లావాదేవీలు, క్యాంటీన్‌కు వచ్చే అతిథుల సంఖ్య, కూరగాయలు మరియు ఇతర నిత్యావసర సరుకుల కొనుగోలు విధానం, వాటి ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే మహిళా సంఘాలకు ఆర్థికంగా మరింత బలాన్ని చేకూర్చేందుకు ఉద్యోగులకు ఫుడ్ సేఫ్టీపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని SERP అధికారులకు సూచించారు . విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా మహిళలతో చర్చించారు. దీనివల్ల మహిళా సంఘాలకు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
క్యాంటీన్లో అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, స్వయంగా కాఫీ ఆర్డర్ చేసి డిజిటల్ పద్ధతిలో చెల్లింపు చేసి మహిళా సంఘ సభ్యులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో SERP డైరెక్టర్ శ్రీ జాన్సన్, అమిద్ టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటీ) శ్రీ వి. శివాజీ, కంపెనీ సెక్రటరీ శ్రీ అనీల్ కుమార్, ఎస్ఈ (సివిల్) శ్రీ రవికాంత్ రెడ్డి, ఏడీఈ (సివిల్) శ్రీ ఉజ్జనప్ప గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

