శంకుస్థాపన చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, యంపీ ఈటెల, బోర్డు నామినేటెడ్ మెంబర్ నర్మద మల్లికార్జున్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి మార్కెట్ అభివృద్ధిలో భాగంగా రూ.1 కోటి 60 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మల్కాజ్ గిరి యంపీ ఈటెల రాజేందర్, నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ తో పాటు కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.
మార్కెట్లో వ్యాపారులు, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, స్థానిక వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.నిధులు మంజూరుకు సహకరించిన మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ కార్యదర్శి వెంకటేష్, మార్కెట్ యార్డు కమీషన్ ఏజెంట్స్అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
