అనుమతులు లేకుంటే కూల్చేసుడే. ఉద్యమ కారులం ఆస్తులు అమ్ముకున్నాం. కేసీఆర్ కి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?
బీఆర్ఎస్ నేతలకు
ఆస్తులు ఎలా పెరిగాయి? ఉద్యమకారులకు
ఆస్తులు ఎలా కరిగాయి? కేసీఆర్ కుటుంబంపై దాడి చేసి తరిమేస్తాం. ఫాం హౌజ్ లను ధ్వంసం చేస్తాం. అక్రమంగా తీసుకున్న భూములను ప్రభుత్వానికి అప్పగించండి.
టీఆర్ఎస్ పెట్టకముందు కేసీఆర్ ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎన్ని?
పార్టీ పెట్టక ముందు కేటీఆర్, హరీష్ ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? మీ ఆస్తులపై మీకు ఇష్టమున్న దేవుళ్ళపై ఒట్టేసి నిజం చెప్తారా? మాకు చెప్పకున్నా పర్లేదు. ప్రజలకు నిజాలు చెప్పండి.
జన్వాడ ఫాం హౌజ్ కేటీఆర్ ది కానప్పుడు అందులో ఆరోజు ఉన్న వీవీఐపీ ఎవరు?
కేటీఆర్ ఫాం హౌజ్ కానప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయించారు?
డ్రగ్స్ డీలింగ్ కోసమే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌజ్ వాడుతున్నాడు. రంగనాయక సాగర్ వద్ద పేదల భూములను హరీష్ రావు లాక్కున్నారు.
బీఆర్ఎస్ నేతలంతా దోచుకున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములే. కోట్లాది రూపాయల భూములు గుంజుకొని లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు.
భూముల పేరు మీద
బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారు. ఈ భూముల అంశంపై విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. నిజాం భూములు, ప్రభుత్వ భూములు దోచుకోవడానికే ధరణి తెచ్చారు. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి?
కష్టపడి వ్యాపారం చేసి రేవంత్ ఇల్లు కట్టుకున్నారు.
