బైక్ ప్రమాదంలో గాయపడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ బంగారు మైసమ్మ దేవాలయం సమీప నివాసి చింతల నరేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.4 లక్షల చెక్కును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు అందజేశారు.
గత కొన్ని రోజుల క్రితం బైక్పై వెళ్తున్న చింతల నరేష్ ప్రమాదానికి గురై గాయపడ్డారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకురావడంతో, వారి కుటుంబానికి అండగా నిలుస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు చెక్కును నరేష్ కుటుంబ సభ్యులకు అందజేసి, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిరాం, గణేష్ తదితరులు పాల్గొన్నారు..
